Man died : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఆ మధ్యకాలంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బర్గర్ (Burger) తిని 47 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పురుగు కుట్టిన మాంసంతో తయారుచేసిన బర్గర్ తినడవం వల్ల అతడికి ఆల్ఫా గాల్ సిండ్రోమ్ (Alpha-gal syndrome) వచ్చింది. దాంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు తుది శ్వాస విడిచాడు. 2024లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్జీనియాలోని ‘యూవీఏ హెల్త్’కు చెందిన పరిశోధకుల బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసింది. ‘ది జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ ఇన్ ప్రాక్టీస్’ పేరిట ఓ నివేదికను వెలువరించింది.
ఆ నివేదిక ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన 47 ఏళ్ల వ్యక్తి 2024లో ఓ హోటల్‌కు వెళ్లాడు. నాన్ వెజ్ బర్గర్ ఆర్డర్ చేసుకుని తిన్నాడు. అయితే బర్గర్‌లోని రెడ్ మీట్ ఓ పురుగు కుట్టడం కారణంగా పాడైపోయింది. ఆ బర్గర్ తిన్న అతడికి గలాక్టోస్ ఆల్ఫా 1తో పాటు 3 గలాక్టోస్ అలర్జీ వచ్చింది. బర్గర్ తిన్న కొన్ని గంటల తర్వాత వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రెడ్ మీట్ తిన్న తర్వాత ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి ఓ వ్యక్తి చనిపోవటం అమెరికాలో అదే మొదటిసారి.
అంతకుముందు పోస్టుమార్టం నివేదికలో అతడు గుండెపోటుతోగానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధితోగానీ, న్యూరోలాజికల్ సమస్యతోగానీ, పొట్టలో సమస్యల వల్లగానీ చనిపోలేదని తేలింది. డాక్టర్లు చనిపోయిన వ్యక్తి అన్ని అవయవాలను నిశితంగా పరిశీలించారు. వాటిలో ఎలాంటి సమస్య కనిపించకపోవడంతో చాలా పరీక్షలు చేసిన తర్వాత అతడు ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వల్ల చనిపోయాడని తేల్చారు.