Asaduddin Owaisi | ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో అతడు ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ మాట్లాడాడు. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించారు. అయితే, ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థిస్తున్న వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. సూసైడ్ బాంబింగ్ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని.. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించారు. అయితే, ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం ఘోరమైన పాపం. ఇలాంటి చర్యలు దేశ చట్టాలకు కూడా పూర్తి విరుద్ధం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇది ముమ్మాటికే ఉగ్రవాదమే’ అని ఒవైసీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు దేశ రాజధాని సమీపంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ఢిల్లీ పేలుడుతో ముడిపడి ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌పై ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘గత ఆరు నెలల్లో స్థానిక కశ్మీరీలు ఎవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని ఆపరేషన్ సిందూర్, మహదేవ్ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. మరి ఈ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చింది..?’ అంటూ ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఒవైసీ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన సంచలన వీడియో బయటకు వచ్చింది. పేలుడుకు ముందు అతడు సూసైడ్ బాంబింగ్ (Suicide bombing) గురించి మాట్లాడాడు. అందులో అతడు ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ మాట్లాడాడు.
సూసైడ్ బాంబింగ్ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని.. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించారు. ‘ఆత్మాహుతి బాంబు దాడికి వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. మరణంపై ఉన్న సహజ అంచనాలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రదేశంలో కచ్చితంగా చనిపోతాడని భావించడాన్ని బలిదాన ఆపరేషన్ అంటారు’ అంటూ ఉమర్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది.
దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోదాలు చేపట్టగా.. ఫరీదాబాద్‌లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. కశ్మీర్‌కు చెందిన కొందరు వైద్యుల మాటున ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ నెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 15 మంది మరణించారు. ఇక ఈ పేలుడుకు పాల్పడింది ఓ వైద్యుడిగా అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. ఈ మేరకు అతడితో సంబంధం ఉన్న వ్యక్తులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఉమర్ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది అని తేలింది. ఉగ్ర దాడుల గురించి అతడు ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని సన్నిహితులు తెలిపారు.
Also Read..
Delhi Blast | పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసిన డాక్టర్ ఉమర్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం
Al Falah Group: టెర్రర్ ఫండింగ్.. 13 రోజుల పాటు ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్
చైనా తరహా 9-9-6 పని విధానం అవసరం