హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/కల్వకుర్తి : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాతృమూర్తి మంగమ్మ (93) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు కడ్తాల మండలం చల్లంపల్లిలో నిర్వహించారు. మంగ మ్మ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించా రు. కన్నతల్లి మరణంతో శోకతప్తులైన జైపాల్ యాదవ్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. జైపాల్‌యాదవ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించి మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించా రు. కాగా మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తదితరులు సంతాపం తెలిపారు.