బెంగళూరు : వారానికి 72 గంటల పని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్‌లోని యువతకు వారానికి 72 గంటల పని దినాలు ఉండాలని మరోసారి పేర్కొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవాంటే చైనా తరహా 9-9-6 విధానం అవసరమని నొక్కి చెప్పారు.
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధికంగా 80 శాతం మంది భారతీయ రోగులు మల్టీడ్రగ్-రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్ కలిగి ఉన్నారని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకటి కంటే ఎక్కువ యాంటీబయాటిక్లతో చికిత్సను నిరోధించే బ్యాక్టీరియాను ఎండీఆర్ఓగా పిలుస్తారు. యాంటీబయాటిక్ నిరోధకత తీవ్రతకు ఈ పరిణామం అద్దం పడుతుందని అధ్యయనం పేర్కొంది.
అనేక మంది రోగులు యాంటీబయాటిక్‌లను తట్టుకునే సూక్ష్మక్రిములను తమ శరీరంలో ఉంచుకున్న కారణంగా భారత్ మందులకు లొంగని క్రిములకు కేంద్రస్థానంగా మారిపోగలదని లాన్సెట్ క్రినికల్ మెడిసిన్ జర్నల్ తన అంతర్జాతీయ అధ్యయనంలో హెచ్చరించింది.