సైబర్ మోసలు రోజురోజుకు అప్డేట్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజులు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన కేటుగాళ్లు ఆ తర్వాత వాట్సప్ అకౌంట్ల మీద పడ్డారు. ఇటీవల నటి అదితి రావు హైదరీ నకిలీ వాట్సాప్ ఖాతాతో కొందరూ ఫొటోగ్రాఫర్లకి మేసేజ్ చేసి డబ్బులు దోచుకుందామని చూశారు కేటుగాళ్లు. అయితే ఈ విషయం బయటకి రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఇదిలావుంటే తాజాగా మరో నటి శ్రియ శరణ్ (Shriya Saran) కూడా ఈ నకిలీ వాట్సప్ బారినపడింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
”సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాట్సప్ ఎవరిదో నాకు తెలియదు. దయచేసి ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండండి. నా పేరుతో డబ్బులు లాగాలని చూస్తున్నారు. ఇది నేను కాదు. ఆ నంబర్ నాది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు బాధగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఆ నకిలీ వ్యక్తి నా ఫ్యామిలీ సభ్యులతో పాటు నేను పని చేయనున్నవారికి సందేశాలు పంపుతున్నాడు. అతడితో జాగ్రత్త” అంటూ శ్రియ రాసుకొచ్చింది.