Viral video : అగ్రరాజ్యం అమెరికా (USA) లోని కాలిఫోర్నియా నగరంలోగల ఓ నగల దుకాణంలో దొంగల మూక చోరీకి యత్నించింది. ముఖానికి ముసుగులు వేసుకుని, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నలుగురైదుగురు దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. అయితే ఆ షాపు యజమాని ధైర్యంగా దొంగలపైకి కాల్పులు జరపడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ షాపులోని సీసీటీవీ (CCTV) లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్గా మారింది.
ఒలీవియా ఫైన్ జ్యువెలరీ స్టో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 13న సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కొంతమంది నల్లటి దుస్తులు, ముసుగులు ధరించి స్టోర్లోకి చొరబడ్డారు. ఒక్కసారిగా దుండగులు లోపలికి రావడంతో షాపులోని సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. దుండగుల చేతుల్లోని ఆయుధాలను చూసి దాక్కున్నారు. ఓ క్లర్క్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత వెనక్కి తగ్గాడు.
ఇంతలో దుండగులను గమనించిన షాపు యజమాని వేగంగా స్పందించారు. తన లైసెన్స్డ్ రివాల్వర్ అందుకుని వారిపై కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు బిత్తరపోయారు. ప్రాణభయంతో షాపులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనపై ఒలీవియా జ్యువెలరీ స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
California jewelry shop owner firing back at robbers
Wild security footage captures a jewelry-store owner shooting at a crew of masked robbers and chasing them out of his shop and into the streets — but not before they made off with $170,000 in gems. pic.twitter.com/nJVU802ulC
— The World Watch (@WorldWatchGoat) November 17, 2025