BRS Party | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్తో పాటు పలువురు నేతలు కారెక్కారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. విమల్ కుమార్తో పాటు పలువురు నాయకులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని విమల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.