Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ బిల్లు విషయంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. ఈ విభేదాల నేపథ్యంలో మస్క్ వైట్‌హౌస్ (White House)ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌తో విభేదాల తర్వాత మస్క్ తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ విందులో పాల్గొన్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ (Saudi Prince) మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు మస్క్ కూడా హాజరుకావడం విశేషం. మస్క్‌తోపాటూ ఈ విందులో పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఎన్విదియా సీఈవో జెన్సెన్ హువాంగ్ కూడా హాజరయ్యారు.
Also Read..
ఏఐ చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దు : పిచాయ్
Viral video | నగల దుకాణంలో దూరిన దొంగల మూక.. యజమాని కాల్పులు జరపడంతో..!
Man died | బర్గర్ తిని వ్యక్తి దుర్మరణం.. అందులో ఏముందంటే..!