Harvard University: సంస్కృత భాషపై అభ్యంతరకర పోస్టు.. క్షమాపణలు చెప్పిన హార్వర్డ్ యూనివర్సిటీ
Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది. ఆ వర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ శాఖ సంస్కతృ భాష ప్రోగ్రామ్‌పై చేసిన ఓ పోస్టు వివాదం కావడంతో హార్వర్డ్ వర్సిటీ దిగివచ్చింది. హిందూ సంఘాల నుంచి వర్సిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
న్యూఢిల్లీ: హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) క్షమాపణలు చెప్పింది. ఆ వర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ శాఖ సంస్కతృ భాష ప్రోగ్రామ్‌పై చేసిన ఓ పోస్టు వివాదం కావడంతో హార్వర్డ్ వర్సిటీ దిగివచ్చింది. హిందూ సంఘాల నుంచి వర్సిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సంస్కృత భాషకు చెందిన ఓ కార్యక్రమంపై పోస్టు చేసిన ఇమేజ్ అభ్యంతరకరంగా ఉన్నదని, దీని పట్లు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు హార్వర్డ్ వర్సిటీ పేర్కొన్నది. సౌత్ ఏషియన్ స్టడీస్ శాఖకు సుదీర్ఘంగా సంస్కృతం బోధించిన అనుభవం ఉన్నదని, ఆ భాష పట్ల తాము కట్టుబడి ఉన్నామని, ఆ భాషతో లింకున్న సంస్కృతికి, మేధోసంబంధమైన అంశాలను గౌరవిస్తున్నట్లు హార్వర్డ్ వర్సిటీ తెలిపింది. తమ శాఖ చేసే సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టనున్నట్లు వర్సిటీ వెల్లడించింది. తమ శాఖ చేసిన పోస్టుకు, లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి సంబంధం లేదని చెప్పింది.
సౌత్ ఏషియన్ స్టడీస్ డిపార్ట్మెంట్ .. సంస్కృత భాష కోర్సులను నిర్వహిస్తోంది. అయితే ఎలిమెంటరీ కోర్సు ప్రమోషన్ కోసం ఆ శాఖ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఇమేజ్ను పోస్టు చేసింది. అయితే ఆ ఫోటోలో ఉన్న ఆర్ట్ వర్క్.. హిందువులు, సంస్కృత భాష అభిమానులను చులకనగా చూపిస్తున్నట్లుగా ఉందని నార్త్ అమెరికా హిందూ సంఘాలు ఆరోపించాయి. మాస్టర్ ఆఫ్ పప్పెట్స్ అన్న టైటిల్‌తో గీసిన బొమ్మ వివాదాస్పదం అయ్యింది. భారతీయ ఆర్టిస్టు అనిరుధ్ సాయినాథ్ ఆ ఆర్ట్ వేశారు. మహాభారత్, కృష్ణరాస లీల ఆధారంగా ఆ ఆర్ట్ గీసినట్లు కొందరు పేర్కొన్నారు. అయితే కృష్ణుడు తోలుబొమ్మలు ఆడిస్తున్నట్లుగా, అతని చేతులో పాండవులు కీలుబొమ్మలుగా ఉన్నట్లు ఆ కళాఖండంలో ఉన్నది. దీన్ని అనేక హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో హార్వర్డ్ వర్సిటీ క్షమాపణలు చెప్పింది. సంస్కృతం క్లాసికల్ భాష అని, సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉన్నదని, దాన్ని దైవభాషగా పిలుస్తారని, ఎన్నో సాహిత, సైద్ధాంతిక, శాస్త్రీయ గ్రంధాలను ఆ భాషలో రాసినట్లు హార్వర్డ్ తన వెబ్సైట్లో వెల్లడించింది.
For those of you who had reached out to us, here is the official apology from the Department of South Asian Studies at @Harvard.
This is one of the rare moments where a university department has formally apologized for their Hinduphobic insensitivity! 👏🏽👏🏽
We are glad to see… https://t.co/E31cSu1Acy pic.twitter.com/CGI3SmG9Ki
— CoHNA (Coalition of Hindus of North America) (@CoHNAOfficial) February 28, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

