లండన్, నవంబర్ 18 : కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది పడితే అది గుడ్డిగా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
లండన్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏఐ రంగంలో పెట్టుబడులు.. ఏదో ఒక రోజు బుడగలా పేలటం ఖాయమని, గూగుల్ సహా ఎవ్వరూ దీనికి అతీతం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.