Rains | రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, మీర్ పేటలో వర్షం కురిసింది.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, మాసబ్‌ట్యాంక్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరోవైపు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయ్యాయి.
రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మరఠ్వాడా వరకు సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించిన కారణంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!