Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
ఉత్తరప్రదేశ్ మథురలోని బర్సానాకు చెందిన 21 ఏళ్ల పరశురామ్ నీట్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు వారం క్రితమే కోటాకు వచ్చాడు. అయితే, కొన్ని గంటల పాటు పరశురామ్ కనిపించకపోవడంతో ఇంటి యజమాని అనూప్ కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం సమయంలో పరశురామ్ను చివరిసారిగా చూసినట్లు అనూప్ పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చేపట్టగా.. అతడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ లాల్ బైర్వా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. విద్యార్థి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 13వ ఘటన. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
Also Read..
Nandigam Suresh | వైఎస్సార్సీపీకి షాక్.. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..
Singur | సింగూరుకు భారీ వరద.. జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
Georgia Shooting | జార్జియా హైస్కూల్లో పేలిన తూట.. నలుగురు విద్యార్థులు మృతి..!