Georgia Shooting | జార్జియా హైస్కూల్లో పేలిన తూట.. నలుగురు విద్యార్థులు మృతి..!
Georgia Shooting | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచీ హైస్కూల్లో బుధవారంజరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Georgia Shooting | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచీ హైస్కూల్లో బుధవారంజరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బారో కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపిన వవరాల ప్రకారం.. ఉదయం 10.30 గంటలకు ముందు అపాలాచీ హై స్కూల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, కాల్పుల కారణాలు మాత్రం తెలియరాలేదు. అనుమానితుడిని 14 సంవత్సరాల విద్యార్థి కోల్ట్ గ్రేగా గుర్తించారు. అతనిపై అభియోగాలను నమోదు చేసి విచారణ జరుపతున్నట్లు జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్రిస్ హోసే తెలిపారు. ఘటనపై జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ స్పందించారు.
హైస్కూల్లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తరగతి గదుల్లో భద్రత కోసం తన కుటుంబం ప్రార్థిస్తుందన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర, భాగస్వామ్య పక్షాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. జార్జియా విద్యాశాఖ అధికారుల రికార్డుల ప్రకారం అపాలాచీ హైస్కూల్లో సుమారు 1,900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించగా.. బారో కౌంటీలో రెండో పెద్ద ప్రభుత్వ పాఠశాల. బారో కౌంటీ దక్షిణ అంచున ఉన్న అపాలాచీ నది పేరును ఈ స్కూల్‌కు పెట్టారు. అపాలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఘటనపై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నామన్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని మరింత ప్రాణనష్టం నివారించిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తుపాకీ సంస్కృతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

