Nandigam Suresh | వైఎస్సార్సీపీకి షాక్.. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ దాఖలు చేయగా.. హైకోర్టు పిటిషన్‌ని తిరస్కరించింది. దాంతో తుళ్లూరు పోలీసులు బుధవారం ఆయనను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని నివాసానికి వెళ్లారు.
అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన తన మొబైల్‌ను స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో పోలీసులు కొంత సేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం ఎక్కడ ఉన్నారనే కోణంలో ఆరా తీశారు. దాంతో ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో పాటు పలువురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన 12 పోలీసుల బృందాల వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

