కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కె) గ్రామంలో నూతనంగా నిర్మించిన విఠలేశ్వర ఆలయంలో విఠల( Vittala ) ,రుక్మిణి ( Rukmini ) విగ్రహాల ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ కన్నుల పండుగగా సాగింది. భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితుడు భబ్రు మహారాజ్ ఆధ్వర్యంలో వేద పండితుల బృందం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ముందుగా ఐదు హోమ కుండాల వద్ద దంపతులచే యజ్ఞ హోమాధి కార్యక్రమాలను నిర్వహించారు. బాల బ్రహ్మచారి వెంకటస్వామి మహారాజ్ పింపల్గాంవ్ విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట ,శిఖర కలశ స్థాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రి, సర్పంచ్ బందెల గంగామణి, బందెల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు దుంపటి రాములు, గజ్జరాం , మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, గడ్డిగారి విఠల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బోయిడి విట్టల్, ఏఎంసీ చైర్మన్ గోనె కల్యాణ్, ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, సింధే చంద్రశేఖర్ పటేల్, స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్,
నాయకులు పానాజీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.