హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంపై గణాంకాలతో సమగ్ర వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ జరిగే నాటికి నివేదిక సమర్పించాలని తెలిపింది. నగరాలు, పట్టణాల్లో ప్రజల జీవితాలు ఉరుకులు పరుగులుగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సేద తీరాలన్నా, ఊరట పొందాలన్నా పారులు ఎంతో అవసరమని, పారుల అభివృద్ధితోపాటు మొ కలు నాటేవిధంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెం దిన కే ప్రతాప్‌రెడ్డి పిల్ దాఖలుచేశారు. దీ నిపై ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం మంగళవారం విచార ణ జరిపిం ది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘గ్రీనరీ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు 8 శాతం గా ఉండగా, రాష్ట్రంలో 8.2 శాతంగా ఉందని చెప్పారు. శ్మశానా ల్లో కూడా మొకలు పెంచుతున్నామని తెలిపారు. 2022 23లో 77,87,561 మొకలు, 2023 24లో 72,28, 127 మొకులు నాటినట్టు వివరించారు.
‘స్థానిక ’బీసీ రిజర్వేషన్లకు చేపట్టిన చర్యలేమిటి?
హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అధ్యయనం నిర్వహించే అంశంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా బీసీల స్థితిగతులపై అధ్యయనం జరిపేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని కోరింది. స్థానిక సంస్థ ల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 5ను సవాలు చేస్తూ జాజుల శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు దాఖలు చేసి న వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవా రం విచారణ జరిపింది. 2010లో కృష్ణమూర్తి కేసు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాలను కాకుండా రాజకీయ వెనుకబాటుతనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, దీనిపై అధ్యయనం జరగాల్సి ఉన్నదని ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆ అధ్యయనానికి చేపట్టిన చర్యలేమిటో నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను 12కి వాయిదా వేసింది.