మహబూబాబాద్, నవంబరు 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులు చిచ్చు రేపాయి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడుతూ అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులను కాదని తిరిగి ఎమ్మెల్యే భార్యకే అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై రాజీనామాల పర్వం మొదలైంది. టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి, డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు దొంతు యాదగిరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకులను కాదని తిరిగి ఎమ్మెల్యే సతీమణికే ఎలా జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉండదని నేను వ్యక్తిగతంగా భావిస్తూ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యే సతీమణి ఉమకే రావడం మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.