Bigg Boss 9| బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్‌కి దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారాంతం వచ్చిందంటే ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తారు. కొన్ని వారాల్లో అనూహ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుంటే, మరికొన్ని వారాల్లో డబుల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇస్తోంది బిగ్ బాస్. అలాగే ఎప్పుడో ఒకసారి ఎలిమినేషన్ కూడా లేకుండా వదిలేయడం బిగ్ బాస్ స్టైల్. అయితే ఈ వారం నామినేషన్లో ఉన్నవారు చూస్తే..ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజనా, డీమన్ పవన్, భరణి, కళ్యాణ్.
ఓటింగ్ ట్రెండ్ల ప్రకారం వీరిలో దివ్య, సంజనా చివరి స్థానాలలో ఉండడంతో వారిలో దివ్య ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. ఇక కళ్యాణ్ భారీ ఓట్లతో టాప్ ప్లేస్‌ని దక్కించుకున్నాడు. ఆ తరువాత భరణి, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ కూడా బాగానే ఓట్లు సొంతం చేసుకున్నారు. అయితే ఈ వారం హౌస్ నుంచి దివ్య తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ వారం బిగ్ బాస్ లో ఎలాంటి ఎలిమనేషన్ ఉండబోదని సమాచారం. అంటే దివ్య డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్‌తో దివ్య మరో వారం హౌస్‌లో కొనసాగనుంది.
ఈ వారం హౌస్‌లో దివ్య, తనూజ మధ్య భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరూ తీవ్రమైన స్థాయిలో అరెచుకున్నారు. కొట్టుకునేంత వరకు వెళ్లిపోయారు. ఈ ఫైట్ TRPలను భారీగా పెంచింది.దాంతో దివ్య–తనూజ ఫైట్‌కి హైపేంటో… ఇలాంటి టైమ్‌లో దివ్యను ఎలిమినేట్ చేస్తారా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ TRP కోసం ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టేశారు, దివ్య తప్పించుకుంది… బిగ్ బాస్ స్క్రిప్ట్ వర్కవుట్ అవుతోంది అని నెట్టింట కామెంట్స్ కనిపిస్తున్నాయి.