Telangana | తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వెంటనే ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్‌తో పాటు మీడియా సంబంధిత గ్రూపులు హ్యాక్ అయ్యాయని తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులపై కూడా క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.