ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత 15 రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ప్రధాన పార్టీల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. గడువు తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధింపు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఎస్ఈసీ ఆదేశించింది. డిసెంబరు 1న సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. డిసెంబరు 1న పోలింగ్. 4న ఓట్ల లెక్కింపు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 1122 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్ నుంచి 146 మంది, టీడీపీ నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది, సీపీఎం నుంచి 12 మంది వీరితో పాటు 415 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
జీహెచ్ఎంసీలో మొత్తం 74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. జంగమ్మెట్ డివిజన్ పోటీలో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా. ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్ల ఈ ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.
తాజావార్తలు
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు