Malla Reddy | కీసర ఎంపీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్దిదారులతో కలిసి ఓ గ్రూప్ ఫొటో దిగేందుకు మల్లారెడ్డి అందర్నీ సిద్ధం చేశారు. గ్రూప్ ఫొటో మంచిగా రావాలే.. అని ఫొటోగ్రాఫర్లను మల్లారెడ్డి ఆదేశించారు. ఇక ఈటల రాజేందర్, మల్లారెడ్డి.. లబ్దిదారుల మధ్యలో నిల్చొని ఫొటోలు దిగారు.
ఈ కార్యక్రమం అనంతరం ఈటల రాజేందర్.. ఈ చెక్కులు ఎప్పటివి..? అని లబ్దిదారులను ప్రశ్నించారు. వారు గత ప్రభుత్వానివి అని చెప్పగా.. మల్లారెడ్డి కల్పించుకొని.. కొత్త చెక్కులు అయితే తులం బంగారంతో వస్తయ్.. ఇవి పాతయే అన్నా అని ఈటలకు బదులిచ్చారు. ఇక చివరగా.. ఒక్క బైట్ ఇవ్వండని మీడియా ప్రతినిధులు మల్లారెడ్డిని అడగ్గా.. సార్(ఈటల రాజేందర్) ఉన్నప్పుడు నేను మాట్లాడితే బాగుండదని చెప్పగా, అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఓసారి లుక్కేయండి..
ఫొటోలు మంచిగ రావాలె.. మల్లారెడ్డి, ఈటెల ఫన్నీ వీడియో
ఈటెల రాజేందర్ ఉన్నపుడు నేను మాట్లాడితే బావుండదు
కీసర ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/JiUBUcW3Wy
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2024
ఇవి కూడా చదవండి..
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో
Niranjan Reddy | ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి : నిరంజన్ రెడ్డి
Harish Rao | గురువులకు మద్దతుగా పిడికిలెత్తిన గురుకుల విద్యార్థులు.. హరీశ్‌రావు ట్వీట్