Sabitha Indra Reddy | ఈ ఎనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టింది. రేవంత్ పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ అయిపోయారని తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేరికలను పక్కన పెట్టి.. సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు సూచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్తో పాటు పలువురు మేధావులు స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఓ యువకుడు విన్నపం చేశాడు. ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.. మీరు మాత్రం కేసీఆర్ సార్‌తోనే ఉండండి అంటూ సబితకక్కు ఆ యువకుడు విజ్ఞప్తి చేశాడు. ఆ యువకుడి విన్నపానికి సబితక్క సరేనని చెప్పారు. మరి ఈ 8 నెలల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉందని సబిత అతడిని ప్రశ్నించగా.. చెత్తలా ఉంది పాలన అని మండిపడ్డాడు. ఈ మాట ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానని యువకుడు పేర్కొన్నాడు. మాకు రైతుబంధు కూడా రాలేదు ఇంకా..ఈ ప్రభుత్వం వేస్ట్ అని అతను చెప్పగా.. తాను ఎక్కడికి వెళ్లను అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇక తాము పార్టీ మారబోమని ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. కేసీఆర్ వెన్నంటి ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని వారు తేల్చిచెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారే నిజమైన నాయకులు, కార్యకర్తలు అని వారు పేర్కొన్నారు.
ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.. మీరు కేసీఆర్ సార్ తోనే ఉండండి ప్లీజ్ 🥹😄 pic.twitter.com/6e1Ah1gkkj
— AR (@AshokReddyNLG) September 5, 2024
ఇవి కూడా చదవండి..
Niranjan Reddy | ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి : నిరంజన్ రెడ్డి
Harish Rao | గురువులకు మద్దతుగా పిడికిలెత్తిన గురుకుల విద్యార్థులు.. హరీశ్‌రావు ట్వీట్
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు