Niranjan Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలకు ఒక ప్రత్యేక మంత్రిగా రెవెన్యూ మంత్రిని పెట్టింది.. ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ కంటే గొప్పగా చేస్తారని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి నమ్ముకున్న జనాలను నిలువునా ముంచారు. మిషన్ కాకతీయలో చెరువులు సరిగ్గా చేయలేదని ఆరోపించడం విడ్డూరం.. ఏం చేయనిదే ఇన్నేళ్లలో భూగర్భజలాలు పెరిగాయా? పరామర్శకు వెళ్లిన సీఎం జీపులో నిలబడి చేయి ఊపి వెళ్తారా అని ప్రజలు విమర్శిస్తున్నారు.. చావుకు, పెళ్లికి ఒకేలా వ్యవహరించడం సీఎంకు అలవాటుగా మారిందని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి ప్రణాళిక లేక వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయినా పాలమూరు బిడ్డగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చూడలేదు. నీటి పారుదల శాఖా మంత్రి ఇంత వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. పెండింగ్ పనులను పూర్తి చేసి నీళ్లను మలుపుకుందామన్న సోయి ప్రభుత్వానికి లేదు. చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో ప్రతిపక్షాన్ని తిట్టి హామీల అమలు విషయాన్ని దృష్టి మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Niranjan Reddy | ఖమ్మం వరదల్లో సుభాన్ హీరో.. ప్రభుత్వం జీరో : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Parthasarathy Reddy | ఖమ్మం వరద బాధితులకు రూ. కోటి విరాళం అందజేసిన ఎంపీ పార్థసారథి రెడ్డి
KTR | రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం వల్లే జైనూర్ లాంటి ఘటనలు : కేటీఆర్