నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna rao ) పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్లో మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి (Flexi controvers)కారణమైంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఫొటోలు లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట