శ్రీశైలం : శ్రీశైల(Srisailam) మహాక్షేత్రంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఆలయ అబ్బూరి వీఐపీ కాటేజీ మొదటి అందస్తులో షార్ట్ సర్య్కూట్తో ఏసీ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..