హైదరాబాద్ : అధికారుల అసమర్ధత, నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు(Satnala project) గేట్లను అధికారులు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో పెండల్ వాడ వాగులో పడి రైతులు కొట్టుకుపోయారు (FarmersWashed away). చివరికి ఎలాగో అలాగా క్షేమంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు ఎత్తే ముందస్తు సమాచారం ఇవ్వాలన్న సోయిలేకపోవడంపై మండిపడుతున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు
వరదల్లో కొట్టుకుపోయిన రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు తెరవడంతో పెండల్ వాడ వాగులో కొట్టుకుపోయిన రైతులు.. చివరికి క్షేమంగా బయటపడ్డ రైతులు. pic.twitter.com/Pg6gGAXwi9
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీపై కేటీఆర్ ప్రశంసల వర్షం
Mowgli | ‘కలర్ ఫొటో’ దర్శకుడితో సుమ కొడుకు కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్
Game Changer | మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గేమ్‌ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్