Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు గతంలోనే ప్రకటించారు.
అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో జరగండి, జరగండి జాబిలమ్మా వచ్చేనండి అంటూ ప్రేక్షకులకు ఆశ చూపించి వదిలేశారు. అయితే సినిమా అప్డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి వినాయక చవితి పండుగ కానుకగా సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు. ఈ మూవీ నుంచి రెండో పాటను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రకటించింది. అయితే ఈ మూవీ నుంచి కనీసం గ్లింప్స్ అయిన విడుదల చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మూవీ నుంచి గ్లింప్స్, టీజర్లు కాకుండా సెకండ్ సింగిల్ అనడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
— Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2024
Also Read..