Aryna Sabalenka | యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా అరీనా సబలెంక నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంక గెలుపొందింది. దీంతో తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ట్రోఫీని అందుకున్న వెంటనే కోర్టంతా తిరుగుతూ ఆమె సంబురాలు చేసుకుంది.
ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అయిన సబలెంక గత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ ఆమె టైటిల్‌ను సాధించలేకపోయింది. కోకో గాఫ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పుడు ఈ యూఎస్ ఓపెన్‌ను గెలిచిన 26 ఏండ్ల బెలారస్ క్రీడాకారిణి సబలెంక తన గ్రాండ్ స్లామ్ల సంఖ్యను మూడుకు చేర్చింది. 2023, 2024లో సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది.
ఇవి కూడా చదవండి..
Paralympics | పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. నవదీప్ అరుదైన ఘనత
Sarfaraz Khan | రెచ్చిపోయిన సర్ఫరాజ్.. వరుసగా ఐదు ఫోర్లు.. వీడియో