Sarfaraz Khan : దేశవాళీ క్రికెట్ అంటూ చాలు దంచికొట్టే సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఈ ఏడాది భారత జట్టు తరఫున అర్ధ శతకాల మోత మోగించిన సర్ఫరాజ్ దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2024)లో బౌలర్లను ఉతికేశారేశాడు. ‘ఇండియా బీ’ తరఫున ఆడుతున్న అతడు శనివారం ఇండియా ఏ పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) ఓవర్లో రెచ్చిపోయి ఆడాడు. వరుసగా ఐదు బంతుల్ని బౌండరీ దాటించి ఔరా అనిపించాడు.
ఇండియా బీ రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ శివాలెత్తిపోయాడు. ఆప్పటికే రెండు వికెట్లు తీసి జోరుమీదున్న అకాశ్ దీప్‌ను టార్గెట్ చేశాడు. అతడు వేసిన 10వ ఓవర్లో తొలి బంతి మినహా ఐదు బంతుల్ని బౌండరీగా మలిచాడు. రెండో బంతిని స్లిప్‌లో ఫోర్ కొట్టాడు. మూడో బంతిని కవర్స్ దిశగా బౌండరీ దాటించాడు.
4⃣4⃣4⃣4⃣4⃣
Sarfaraz Khan on 🔥
He hits five fours in an over, off Akash Deep!
What delightful strokes 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/AWE5JhJiuS
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
ఆ తర్వాతి మూడు బంతుల్ని కూడా వదలకుండా ఫోర్లు కొట్టాడు. సర్ఫరాజ్ ధాటికి తల పట్టుకున్న ఆకాశ్ ఆ ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. సర్ఫరాజ్ ఐదు ఫోర్లతో విరుచుకు పడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే ఔటైన రిషభ్ పంత్(61: 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు.
50 for Rishabh Pant! 👌
He brings it up off just 34 balls 🔥#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38DTlt pic.twitter.com/OPSfsvFhqI
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
క్రీజులోకి రావడమే ఆలస్యం ధనాధన్ ఆడిన పంత్.. 34 బంతుల్లోనే యాభై కొట్టేసి ఇండియా బీ స్కోర్ బోర్డును ఉరికించాడు. మరో ఎండ్‌లో సర్ఫరాజ్ ఖాన్(46 : 36 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా దంచాడు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా బీ 6 వికెట్ల నష్టానికి 150 రన్స్ కొట్టింది.
ప్రస్తుతం ఇండియా బీ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 92కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియా బీ.. ముషీర్ ఖాన్(181), నవ్‌దీప్ సైనీ(56)ల రికార్డు భాగస్వామ్యంతో కోలుకుంది. వీళ్లిద్దరూ 8వ వికెట్‌కు 205 రన్స్ జోడించడంతో అభిమన్యు ఈశ్వరన్ బృందం 321 పరుగులు చేయగలిగింది.
ముషీర్ ఖాన్(181)