కృష్ణకాలనీ, జనవరి 4 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.