వడోదరా: డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు సిండ్రెలా దాస్, దివ్యాంశి భౌమిక్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన బాలికల అండర్-19 విభాగం తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ సిండ్రెలా దా 11-7, 11-7, 11-8తో అర్చిస్మిత మహతోపై అలవోక విజయం సాధించింది.
మరో సింగిల్స్‌లో దివ్యాంశి భౌమిక్ 11-4, 11-3, 11-7తో శ్రేష్ట కొంతమ్పై గెలిచి ముందంజ వేసింది. గ్రూపు-2లో మికు బెగాన్ 11-3, 11-6, 11-4తో గుంజన్ కుమార్‌పై గెలిచాడు. అండర్-19బాలుర కేటగిరీలోనూ టాప్‌సీడ్ ప్లేయర్లు నాకౌట్‌కు అర్హత సాధించారు.