Mowgli Movie | బబుల్గమ్’ (Bubblegum) అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala). క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రోమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రోషన్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. కలర్ ఫొటో(Color Photo) వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రాజ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు రోషన్.
వినాయక చవితి కానుకగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు మౌగ్లీ (Mowgli) అనే సూపర్ హీరో టైటిల్ పెట్టారు మేకర్స్. లవ్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను సమ్మర్ 2025 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.
An enchanting tale of fun, love and heartbreaks that’s bound to leave you spellbound💥
Welcome to the world of Murali, alias #Mowgli ❤️🔥#MowgliFirstLook Starring @RoshanKanakala is out now on the auspicious occasion of Ganesh Chaturthi ✨🙏
Get ready for the magical combo to… pic.twitter.com/wg8cSuo5OF
— People Media Factory (@peoplemediafcy) September 7, 2024