BRS NRI Bahrain cell | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నారైలను ఎద్దేవా చేయడం, లక్షలాది ఎన్నారైలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నలుమూలలున్న తెలంగాణ ప్రవాసులు కష్టపడి పని చేస్తుంటే ప్రతీ సారి దేశం వెలుపల నివసిస్తున్న లక్షలాది మంది ఎన్నారైలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసి మాట్డాడటం, అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు..
బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్ పెట్టి నిగ్గదీసి అడిగితే , కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేతగాక వణికి పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, జల హక్కుల కోసం ,జల సాధన కోసం మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడకుండా.. ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో సర్పంచులకు మంచిగా చెప్పాల్సింది పోయి వారు ఉపయోగించిన భాష తెలంగాణ రాష్ట్రానికి మచ్చగా మారిందన్నారు.
ముఖ్యమంత్రి గౌరవ ప్రదమైన హోదాలో ఉండి ఇలా మాట్లాడటం అత్యంత బాధాకరమన్నారు. ప్రజాసామ్యంలో ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని, నాయకులను బెదిరింపులకు గురిచేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయండి, రైతన్నలకు యూరియా ఇవ్వండి.
బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసింది. 10 శాతం పనులు పూర్తి చేయాల్సింది ఉన్నది. ప్రభుత్వం వాటిపైన ద్రుష్టి పెట్టాలన్నారు. సర్పంచుల ఎన్నికల ఫలితాల్లో మీ ప్రజా పాలనలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మార్పు మొదలైంది. రానున్న ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని స్పష్టం చేశారు.
Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు