Instagram : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ ఎక్కువగా చూసేవారి కోసం కీలక ఫీచర్లో అప్డేట్ చేయనుంది. పాజ్ అండ్ ప్లే ఫీచర్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు ఒక రీల్ చూస్తున్నప్పుడు మధ్యలో ఆపాలంటే స్క్రీన్ ప్రెస్ చేసి, హోల్డ్ చేయాలి. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. వీడియోలో కావాల్సిన చోట పాజ్ చేయాలంటే ఇబ్బంది కలిగేది.
స్క్రీన్‌పై ప్రెస్ చేసి, హోల్డ్ చేసే లోపు వీడియో ఇంకాస్త మూవ్ అయ్యేది. దీంతో కావాల్సిన దాన్ని పాజ్ చేసేందుకు రెండు, మూడు సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అయితే, ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. నేరుగా స్క్రీన్‌పై ట్యాప్ చేస్తే చాలు.. వీడియో పాజ్ అవుతుంది. సింగిల్ ట్యాప్‌తో వీడియోను పాజ్ చేయొచ్చని ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. ఇకపై ఏదైనా క్యాప్షన్ చదవాలన్నా, ఒక మూమెంట్‌ను క్యాచ్ చేయాలన్నా చాలా ఈజీ అవుతుంది. సింగిల్ ట్యాప్‌తో పాజ్, మరో ట్యాప్‌తో ప్లే అవుతుంది. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే టిక్‌టాక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఉంది. కానీ, ఇన్స్టాగ్రామ్ ఇంతకాలానికి ఈ ఫీచర్ తీసుకొచ్చింది.
అలాగే రీల్ పాజ్ చేసే ఆప్షన్‌తోపాటు మ్యూట్ బటన్‌ను కూడా తీసుకురానుంది. త్వరలో వచ్చే అప్డేట్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. వీటితోపాటు పలు ఏఐ ఫీచర్లను కూడా ఇన్స్టాగ్రామ్ తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.