లక్నో: ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో.. సమోసాల కోసం కొందరు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా లక్నోలో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఇక ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు అక్కడ స్నాక్స్ లో భాగంగా సమోసాలు(Samosa Snack) పంచిపెట్టారు. అయితే ఒకవైపు మోదీ ప్రసంగిస్తుండగా, సమోసాల కోసం కొందరు బీజేపీ అభిమానులు తన్నుకున్నారు.
కూర్చీల్లో కూర్చున్న వారికి సమోసాలు అందకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో కొందరు పెనుగులాడారు. ఆ కొట్లాట వీడియోకి చిక్కింది. ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగుతున్నా.. పార్టీ కార్యకర్తలు మాత్రం సమోసాల కోసం తన్నుకుంటూనే ఉన్నారు. కుర్చీల మీద పడుతూనే పంచ్‌లు విసురుకున్నారు. కాసేపయ్యాక సమోసా సమరాన్ని ఆపారు.
వైరల్‌గా మారిన ఆ వీడియోపై ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. వన్ నేషన్, వన్ సమోసా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. రాజకీయాల కన్నా సమోసే ముఖ్యమని కొందరన్నారు. సమోసా బ్రదర్వుడ్ అని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కార్యక్రమం తర్వాత సిటీలో ఏర్పాటు చేసిన డెకరేషన్ ఫ్లవర్ పాట్స్‌ను కూడా కొందరు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
One Nation One Samosa 😱
Just watched this Chaotic Video from a Modi event in Lucknow – ardent supporters throwing punches allegedly over Samosas! 😂#ModiHaiTohMumkinHai #BJPHatesBrahmin pic.twitter.com/vQQ5xO1neX
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) December 26, 2025