KTR | ట్విట్టర్లో వాతావరణ వార్తలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ వెదర్ మ్యాన్. ట్విట్టర్ (ఎక్స్)వేదికగా తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఇస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ. సోషల్ మీడియాలో ఐఎండీతో పాటు ఎంతోమంది వెదర్ మ్యాన్లు ఉన్నా బాలాజీ చెప్పాడంటే.. ఆరోజు ఖచ్చింతంగా వర్షం పడాల్సిందే.
ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్టు అందించి, అందర్నీ అలర్ట్ చేస్తున్న బాలాజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి వాతావరణ హెచ్చరికలతో అద్భుతంగా పని చేస్తున్న యువకుడు బాలాజీకి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఉదార సేవకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన టీ బాలాజీ బీటెక్ చదువుతున్నాడు. ట్విట్టర్లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ పేరుతో ఖాతా తెరిచాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ వర్షాకాలంలో తాజా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటాడు.
My compliments to you dear Balaji Garu, a young man who’s been doing a great job with these kind of weather alerts
Thank you for your generous service and wish you the best https://t.co/WhTM1lIBy1
— KTR (@KTRBRS) September 7, 2024
ఇవి కూడా చదవండి..
Game Changer | మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గేమ్‌ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత..