KS Rathnam | మొయినాబాద్, జనవరి 11 :ఎవరికి ఎంత ధనం ఉన్నా ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గుమ్మల్ల సీతారాం రెడ్డి, ఆయన సోదరుడు గుమ్మల్ల విక్రం రెడ్డి గ్రామంలో మెడివిజన్ కంటి దవాఖాన వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్నిఏర్పాటు చేశారు.
సుమారుగా 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏడాది నుంచి పదేళ్లలోపు వయసు ఉన్న ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరిచి పదివేలు దశలవారీగా జమ చేయడానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. వారికి పోస్టాఫీస్‌లో ఖాతాలను తెరిపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేతుల మీదుగా ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. గుమ్మల్ల సీతారాంరెడ్డి గ్రామంలో గత ఐదారేండ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడని చెప్పారు. గ్రామంలో రైతులకు పంటలకు స్ప్రే చేసే పంపులను పంపిణీ చేయడంతోపాటు వృద్ధులకు వికలాంగులకు చేతి కర్రలు, స్టాండ్లు, నడుముకు బెల్టులు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని నిరుద్యోగ మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్ పై శిక్షణ ఏర్పాటు చేసి ఉచితంగా కుట్టు మిషన్ కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించి.. కంటి అద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
గ్రామంలోని పేదలకు ఏడాది నుంచి పదేళ్ల వయసు ఉన్న ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పోస్ట్ ఆఫీసులో ఖాతాలను తెరిచి ప్రతి ఖాతాలో దశలవారీగా పదివేల వరకు జమ చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకున్నాడని పేర్కొన్నాడు. గ్రామంలో క్రికెట్ టోర్నమెంటులు ఏర్పాటు చేసి యువతను క్రీడా రంగం వైపు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, ఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు గున్నాల గోపాల్ రెడ్డి, క్యామ పద్మనాభం, మున్సిపల్ అధ్యక్షులు ఎన్ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభు యాదవ్, ప్రశాంత్ గౌడ్, బొర్ర జగన్, కొంగరి నారాయణరెడ్డి, పాశం బాలరాజ్, విజయ్ గౌడ్, విజయ్ పాండు యాదవ్,మధుసూదన్ గౌడ్, కర్రోళ్ల కన్నా, బొర్రా సందీప్, బొర్రా శివ, రామగల గిరిబాబు, ఆర్ రాజు, శంభు యాదవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
