Nature beauty : ఉత్తరాది రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దాంతో పలు ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. ఆ గడ్డకట్టిన నీటితో పలు సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ దృశ్యాలు పర్యాటకుల (Tourists) కు కనువిందు చేస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కశ్మీర్‌లోని దాల్ లేక్ ఉపరితలంపై నీరు గడ్డకట్టుకుపోయింది. దాంతో సరస్సుపై చాలావరకు మంచుపొర ఏర్పడింది. ఈ దృశ్యాలను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. అదేవిధంగా అనంతనాగ్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సబ్జీరో స్థాయికి పడిపోవడంతో.. కొండలపై నుంచి జాలువారుతున్న నీరు గడ్డకట్టింది.
నీరు కిందకు జారిపోతూ గడ్డకట్టడంతో.. ఆ దృశ్యాలు తెల్లటి వజ్రాల్లా, క్రిస్టల్ తీగల్లా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలను టూరిస్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అత్యంత అరుదుగా కనిపించే ఆ అపురూపమైన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..
#WATCH | J&K: Cold wave continues in the villages and hilly areas of Anantnag as the temperature has dropped to sub-zero. pic.twitter.com/T73K8UaxAs
— ANI (@ANI) January 11, 2026