వాషింగ్టన్: మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ.. వీల్ చైర్ నుంచే విశ్వరహస్యాలను చేధించిన స్టీఫెన్ హాకింగ్(Stephen Hawking) కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌కు చిక్కారు. బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త హాకింగ్.. బికినీ ధరించిన ఇద్దరు అమ్మాయిలతో ఉన్న ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ఫోటోను ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి బయటకు తీసినట్లు తెలిసింది. సెయింట్ థామస్‌లోని రిట్జ్ కార్లటన్ హోటల్లో జరిగిన సైన్స్ సదస్సు సమయంలో 2006లో ఆ ఫోటో తీసినట్లు అంచనా వేస్తున్నారు. సూర్యరశ్మి కోసం సేదతీరే కుర్చీపై వాలిన హాకింగ్ చేతిలో కాక్టెయిల్ ఉన్నది. హాకింగ్ దగ్గర అటూ ఇటూ నిలుచున్న ఇద్దరు అమ్మాయిలు బికిని దుస్తుల్లో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా కాక్టెయిల్ పట్టుకున్నారు.
అమెరికా ఫైనాన్షియర్, సెక్స్ అఫెండర్ ఎప్స్టీన్కు చెందిన ఫైల్స్‌లో హాకింగ్ ఫోటో ఉండడం గమనార్హం. అయితే ఆ ఫైల్స్‌లో సైంటిస్ట్ హాకింగ్‌కు చెందిన చాలా ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. సెయింట్ జేమ్స్ దీవిలో ఉన్న ఎప్స్టీన్ రిసార్టును విజిట్ చేసిన 21 మంది శాస్త్రవేత్తల్లో హాకింగ్ కూడా ఒకరు. బ్లాక్ హోల్స్ రహస్యాన్ని విప్పిన హాకింగ్‌కు చెందిన 250 ఫోటోలు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్నట్లు తెలిసింది. 76 ఏళ్ల వయసులో హాకింగ్ 2018లో మరణించారు. 2006లో ఎప్స్టీన్ ఫండింగ్ చేసి నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లో హాకింగ్ పాల్గొన్నట్లు తెలిసింది. కరీబియన్ దీవుల్లోని సెయింట్ థామస్‌లో హాకింగ్ పర్యటించిన ఫోటోలు ఉన్నా.. ఇప్పటి వరకు మాత్రం నేరుగా ఎప్స్టీన్తో దిగిన ఫోటో ఒక్కటి కూడా రిలీజ్ లేదు.
హాకింగ్‌తో ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఆయనకు సేవ చేసేవారని తెలిసింది. ఓ సందర్భంలో హాకింగ్ జలాంతర్గామిలో ప్రయాణించినట్లు కూడా ఫోటో ఉన్నది. అండర్‌వాటర్ వెసల్‌ను హాకింగ్ కోసం ఎప్స్టీన్ మార్పులు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రిలీజైన ఫోటోపై హాకింగ్ ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది. ఖగోళ శాస్త్రవేత్త హాకింగ్ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదు అని ఫ్యామిలీ పేర్కొన్నది.