నాగర్కర్నూల్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతులు కన్నెర్ర జేశారు. కండ్లముందే తమ శ్రమను దళారులు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయిన రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని(Agricultural Market office) ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట(Achampeta) వ్యవసాయ మార్కెట్లో వ్యాపారస్తులు, అధికారులు కలిసి వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించి మార్కెట్ చైర్ పర్సన్ భర్త, మార్కెట్ సెక్రటరీపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైతులు, మార్కెట్ వ్యాపారస్తులతో చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..