Jasprit Bumrah | ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. దుబాయిలో జరిగే మ్యాచుల కోసం బీసీసీఐ జట్టును సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయితే, ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ టీమిండియాను కలవరానికి గురి చేస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది కష్టమేనని.. అప్పటి వరకు బుమ్రా వందశాతం ఫిట్నెస్ సాధించడం ఓ అద్భుతమేనని ఓ నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి బుమ్రా వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. వన్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచులకు దూరం కానున్నాడు. మూడో మ్యాచ్ వరకు సిద్ధంగా ఉంటాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా.. చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో చికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, టోర్నీకి ముందు మిస్టరీ బౌలర్ వందశాతం ఫిట్‌గా ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని.. ఈ క్రమంలో బీసీసీఐ అతనికి బ్యాకప్‌గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నది. బుమ్రా ఫిట్నెస్ సాధిస్తే ఒకే.. లేకపోతే బ్యాకప్‌గా హర్షిత్ రాణా.. లేదంటే మహ్మద్ సిరాజ్‌ను చాంపియన్స్ ట్రోఫీకి పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. బోర్డుకు చెందిన వైద్యబృందం న్యూజిలాండ్‌లోని షౌటెన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బుమ్రాను న్యూజిలాండ్‌కు పంపాలని బోర్డు భావించినా.. అది కార్యరూపం దాల్చలేదు. మిస్టరీ బౌలర్ తప్పుకుంటే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణాను దుబాయికి పంపే ఛాన్స్ ఉంది. బుమ్రా 2022లో గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో షౌటెన్ వైద్యసేవలు అందించారు. తాజాగా మరోసారి న్యూజిలాండ్‌లోని షౌటెన్తో గాయానికి సంబంధించిన రిపోర్టులు పంపి.. అభిప్రాయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. ఆయన అభిప్రాయం మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నది. వందశాతం ఫిట్నెస్ సాధిస్తాడని హామీ ఇస్తే న్యూజిలాండ్‌కు బుమ్రాను పంపాలని.. లేకపోతే అతనికి బ్యాకప్‌గా మరో బౌలర్‌ను తీసుకునే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Jasprit Bumrah: బుమ్రాకు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Smriti Mandhana: స్మృతి మందానాకు ఐసీసీ వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Mohammed Siraj | జనై భోస్లేతో డేటింగ్ వార్తలపై స్పందించిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్..!