Mohammed Siraj | జనై భోస్లేతో డేటింగ్ వార్తలపై స్పందించిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్..!
Mohammed Siraj | హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ సింగర్ జనై భోస్లే డేటింగ్లో ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముంబయిలో జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం.. వేడుకల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
Mohammed Siraj | హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ సింగర్ జనై భోస్లే డేటింగ్లో ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముంబయిలో జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం.. వేడుకల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ ఫొటోల్లో సిరాజ్, జనై సన్నిహితంగా ఉండడంతో ఇద్దరు రిలేషన్లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. పలువురు యూజర్లు సైతం ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక ఈ వార్తలపై సిరాజ్ స్పందించాడు. రిలేషన్ వార్తలను ఖండించారు.
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. తనకు జనై భోస్లే సోదరిలాంటి దని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. జనై లాంటి సోదరి తనకు ఎవరూ లేరని.. ఆమె లేకుండాను తాను ఉండాలనుకోనని పేర్కొన్నాడు. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా.. ఆమె వెయ్యి మందిలో ఒకరు అంటూ సిరాజ్ స్పందించాడు. మరో వైపు జనై సైతం స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడంటూ డేటింగ్ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టింది. జనై భోస్లే బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనుమనరాలు. జనై సైతం ప్రస్తుతం సింగర్‌గా కొనసాగుతున్నది. త్వరలోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నది.
Read Also :
Jasprit Bumrah | కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో బుమ్రా సందడి.. వీడియో వైరల్
Team India | అండర్-19 ప్రపంచకప్.. సెమీస్‌కు అడుగు దూరంలో యువ భారత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

