Jasprit Bumrah | ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) ఈవెంట్ దేశంలో ఘనంగా సాగుతోంది. గత వారం ముంబైలో నిర్వహించిన ఈ కోల్డ్ ప్లే కన్సర్ట్కి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తాజాగా అహ్మదాబాద్ (Ahmedabad)లో కోల్డ్‌ప్లే సెకండ్ షో ఆదివారం ఉత్సాహంగా సాగింది. నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరిగిన ఈ ఈవెంట్‌కు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) హాజరయ్యారు.
The ‘game changer’ player is in the house 🔥 turning everything yellow 💛#ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 26, 2025
వెన్ను గాయం కారణంగా ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉంటున్న బుమ్రా ఈ కచేరీలో సరదాగా గడిపారు. ఈ స్పెషల్ ఈవెంట్లో బుమ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా బుమ్రాపై సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin) ప్రశంసలు కురిపించారు. అతడిపై ఓ స్పెషల్ సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ‘జస్ప్రిత్.. మై బ్యూటిఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వీ డు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్’ అంటూ పాటపాడాడు క్రిస్ మార్టిన్. ఈ సాంగ్‌ను బుమ్రాతోపాటు ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక కన్సర్ట్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన తాలూకు వీడియోను కూడా ప్రదర్శించారు. ఈ క్రమంలోనే స్టేడియం మొత్తం బుమ్రా నామస్మరణతో మార్మోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
COLDPLAY HONOURING JASPRIT BUMRAH AT THE NARENDRA MODI STADIUM. 🇮🇳
– Bumrah, the GOAT. 🐐pic.twitter.com/H4Oy9rNXal
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2025
Also Read..
Team India | అండర్-19 ప్రపంచకప్.. సెమీస్‌కు అడుగు దూరంలో యువ భారత్
Tilak Varmam | నా కెరీర్‌కు అదే టర్నింగ్ పాయింట్: తిలక్ వర్మ
TDCA | నేటి నుంచి టీడీసీఏ క్రికెట్ టోర్నీ.. బరిలో ఉమ్మడి జిల్లాల జట్లు: అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి