హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌తోపాటు గల్ఫ్ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని తెలిపారు.