TDCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) ఆధ్వర్యంలో సోమవారం (జనవరి 27) నుంచి అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. నాలుగు రోజుల పాటు నగరంలోని ఎల్బీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లాల (9) జట్లతో పాటు టీడీసీఏ ఎలెవన్ పోటీపడుతుంది.
ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకే ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్లో సత్తా చాటిన క్రికెటర్లను మార్చిలో అమెరికా క్రికెట్ అకాడమీ జట్టుతో పోటీపడే టోర్నీకి ఎంపిక చేయనున్నట్టు ఆయన చెప్పారు.