Tilak Varmam | చెన్నై: పొట్టి ఫార్మాట్లో గత ఏడాదికాలంగా అంచనాలకు మించి రాణిస్తున్న హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ.. టీ20లలో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ తనను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడమే కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని అన్నాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక తిలక్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు సూర్యా భాయ్ నాకోసం తన 3వ స్థానాన్ని వదులుకున్నాడు.
అదే నా కెరీర్లో కీలక మలుపు. అందుకు సూర్యకు కృతజ్ఞతలు చెబుతున్నా. జట్టు కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే’ అని తెలిపాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్ము రేపిన ఈ హైదరాబాదీ.. చెన్నై మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.