ముంబై: భారత మహిళా బ్యాటర్ స్మృతి మందానా(Smriti Mandhana)కు.. 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. గత ఏడాది వన్డే క్రికెట్లో స్మృతి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 2024లో ఆమె రన్‌మెషీన్‌లా స్కోర్ చేసింది. కేవలం 13 వన్డేల్లో 747 రన్స్ చేసిందామె. భారత జట్టు విజయాల్లో బ్యాటర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఇండియా 3-0 తేడాతో గెలవడంలో స్మృతి కీలకంగా నిలిచింది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో.. తుది వన్డేల్లో సెంచరీతో చెలరేగింది. డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి తన సత్తా చాటిందామె.
మహిళ వన్డే అంతర్జాతీయ క్రికెట్లో .. స్మృతి మందానా కొత్త స్టాండర్డ్‌ను నెలకొల్పింది. ఓ క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. 2024లో ఆమె 13 మ్యాచుల్లో 747 రన్స్ చేసింది. దీంతో మహిళల వన్డేల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మందానా.. లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచింది. లౌరా వోల్వార్డ్ 697, టమ్మీ బీమౌంట్ 554, హేలే మాథ్యూస్ 469 రన్స్‌తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
మందానా 57.86 సగటుతో బ్యాటింగ్ చేసింది. ఆమె స్ట్రయిక్ రేట్ 95.15గా ఉంది. దూకుడు ఆటతీరుతో ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఆమె ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నది. గత ఏడాది స్మృతి మందానా.. నాలుగు వన్డే సెంచరీలు నమోదు చేసింది. మహిళల క్రికెట్లో ఇదో కొత్త రికార్డు. 2004లో వన్డేల్లో వందకుపైగా బౌండరీలను బాదింది. వీటిల్లో 95 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
For the second time, one of the leading stars of the game takes out the ICC Women’s ODI Cricketer of the Year award 🌟 pic.twitter.com/LJbgA8OobX
— ICC (@ICC) January 27, 2025