YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని, ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గతంలో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే.. ఈ కేసుకు కూడా వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానిపై సోమవారం నాడు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. మాజీ సీఎంపై నమోదైన కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. బెయిల్ మంజూరైన తర్వాత జగన్ విచారణకు రావడం లేదని.. కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. కానీ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే.. ఈ కేసుకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది.
ట్రయల్ కోర్టు, రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అందువల్ల ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే జగన్ బెయిల్ రద్దు కారణాలు ఏవీ లేవని అభిప్రాయపడింది. రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఈ వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది కోరగా.. సుప్రీంకోర్టు అంగీకరించింది.