SL vs ENG : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 తొలి పోరులో ఇంగ్లండ్ ఆరంభంలో తడబడినా పోరాడగలిగే స్కోర్ చేసింది. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(3-26), థీక్షణల(2-21)లు అద్భుతంగా కట్టడి చేయడంతో టాపార్డర్, మిడిలార్డర్ తేలిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిల్ సాల్ట్(62) ఒత్తిడిలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. ఆఖర్లో విల్ జాక్స్(13), జేమీ ఓవర్టన్(10 నాటౌట్)లు దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
నాకౌట్ దశలో శ్రీలంక స్పిన్నర్లు చెలరేగిపోయారు. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. దునిత్ వెల్లలాగే(3-26) టాపార్డర్‌ను పడగొట్టి ఆరంభంలోనే దెబ్బ కొట్టాడు. డేంజరస్ జోస్ బట్లర్(7)ను వికెట్ల ముందు అతడు దొరకబుచ్చుకోగా .. కాసేపటికే జాకబ్ బెథెల్(3)ను మహీశ థీక్షణ(2-21) ఔట్ చేయడంతో పవర్ ప్లేలోనే ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న టామ్ బ్యాంటన్(6)ను శనక రనౌట్ చేయగా.. హ్యారీ బ్రూక్(14)ను ఎల్బీగా వెనక్కి పంపిన వెల్లలాగే ఇంగ్లండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
An excellent bowling performance by Sri Lanka to keep England to a below-par total!
England successfully defended 128 at Pallekele before the World Cup – can they defend 146 today?
Follow the chase: https://t.co/CqKi3mf3oU pic.twitter.com/CNu01YxsVm
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిల్ సాల్ట్(62) పట్టుదలగా ఆడాడు. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదిస్తూ అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న సాల్ట్‌ను సైతం వెల్లలాగేఔట్ చేసి పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ సామ్ కరన్(11) సైతం విఫలమవ్వగా.. విల్ జాక్స్ (13 ) బాధ్యత తీసుకున్నాడు.
Dunith Wellalage ends a fighting knock from Phil Salt, who has found some form after a tough start to the World Cup 👊 pic.twitter.com/AAbdVjLvw2
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
మధుశనక ఓవర్లో రెండు ఫోర్లతో స్కోర్ 130 దాటించాడు. కానీ, పెద్ద షాట్‌కు యత్నించి వెల్లలాగే చేతికి చిక్కాడు. ఆ తర్వాతి బంతికే ఆర్చర్ మిడ్ వికెట్లో హేమంత డైవింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్(10 నాటౌట్) సిక్సర్ బాదగా లంకకు ఇంగ్లండ్150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.