Imtiaz Ali | బాలీవుడ్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌లో టాప్‌లో ఉంటాడు ఇంతియాజ్ అలీ. ఈ స్టార్ డైరెక్టర్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి జబ్ వీ మెట్ (Jab We Met). రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనాకపూర్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించారు.
కల్ట్ ఫేవరేట్ సినిమాల లిస్టులో టాప్‌లో ఉండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కరీనాకపూర్ పోషించిన గీత్ పాత్రను అభిమానులు ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే జబ్ వీ మెట్ తర్వాత మళ్లీ కరీనాకపూర్‌తో ఎందుకు కలిసి పనిచేయడం లేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు ఇంతియాజ్ అలీ. అంతటి బలమైన కథ మళ్లీ దొరకలేదన్నాడు.
‘నేను ప్రయత్నించా. కానీ ఎప్పుడూ కరీనాకపూర్‌కు ఆఫర్ చేసేలా.. ఆమె ఒప్పుకునేంత అలాంటి పాత్ర నాకు ఎప్పుడూ దొరకలేదు’ అన్నాడు ఇంతియాజ్ అలీ. సరైన కథ దొరకకపోవడం వల్లే ఐకానిక్ పెయిర్ మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాలేదని ఇంతియాజ్ అలీ రియాక్షన్‌తో అర్థమవుతోంది. మరి రానున్న రోజుల్లోనైనా ఇంతియాజ్ అలీ కోరుకునే కథ దొరికితే ఈ కాంబోను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చనడంతో ఎలాంటి సందేహం లేదు.
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టేనట..!
Jai Hanuman | హనుమంతుడి జన్మస్థలంలో గ్రాండ్‌గా మొదలైన ‘జై హనుమాన్’ – రిషబ్ శెట్టితో భారీ సీక్వెల్!
Farmer Registry | ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి..